BDK: పట్టణ శివారులో ఖమ్మం ఆబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది 11.15 కిలోల గంజాయి, 22 లీటర్ల నాటు సారాను వేర్వేరు ఘటనల్లో పట్టుకున్నారు. ఒడిశాకు చెందిన దాముహంటల్, బీమాగుట్ట అనే వ్యక్తులు ద్విచక్ర వాహనంపై గంజాయిని హైదరాబాద్కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నల్లబెల్లి పరిసర ప్రాంతాల నుంచి ఐదు వ్యక్తులు తరలిస్తున్న నాటు సారాను స్వాధీనపరచుకొని కేసు నమోదు చేశారు.