ఏలూరులో మంత్రి పార్థసారథితో కామవరపుకోట మండల కూటమి నాయకులు సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మండలానికి సంబంధించిన పలు సమస్యలను మంత్రికి వివరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి, టీడీపీ పార్టీ మండల అధ్యక్షుడు కిలారు సత్యనారాయణ తదితరులు ఉన్నారు.