TG: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ కోసం అధికారులు రైతులను ఇబ్బంది పెడుతున్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో రైతులు ధాన్యం ఆరబోసుకున్న స్థలంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు. దీంతో ఆరబోసిన వడ్లు తీయాలని అధికారులు హుకుం జారీ చేశారు. సొంతపోలంలో వడ్లు ఆరబోసుకున్నాం మా వడ్లు ఎందుకు తీయాలని రైతులు అధికారులను నిలదీశారు.