TG: రాష్ట్రం నుంచి ఫిలిప్పీన్స్ దేశానికి వెళ్తున్న బియ్యం నౌకను.. కాకినాడ పోర్టులో మంత్రి ఉత్తమ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా బియ్యం ఎగుమతుల తీరును ఆయన పరిశీలించారు. ఇతర దేశాలకు కూడా బియ్యం ఎగుమతి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 280 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి జరుగుతుందని.. ఇందులో రేషన్ అవసరాలు పోనూ.. మిగిలిన వాటిని ఎగుమతి చేస్తామన్నారు.