ATP: జిల్లాలో రేపు ఉదయం 7 గంటల నుంటి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేస్తామని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకు వచ్చి అందజేస్తారని చెప్పారు. జిల్లాలో 2,79,165 మందికి రూ.123.76 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు వివరించారు. రేపు పింఛన్ తీసుకోని వారికి 2వ తేదీ పంపిణీ చేస్తారని తెలిపారు.