JN: రంజాన్ పండుగను పురస్కరించుకుని కొడకండ్ల మండల కేంద్రంలో ఆసురఖాన అభివృద్ధికి రూ.7 లక్షలు, రామవరం గ్రామంలోని ఈద్గా అభివృద్ధికి రూ.3లక్షలను ఎమ్మెల్యే నిధుల నుంచి మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలో అన్ని మతాల అభివృద్ధే తన లక్ష్యమన్నారు.