KMR: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాస పథకానికి బుధవారం నుంచి ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి తెలిపారు. దరఖాస్తుదారులకు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలోని ప్రజా పాలన కేంద్రంలో ఉచితంగా దరఖాస్తు ఫారాలను అందజేస్తామన్నారు. వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ చేస్తామని, దళారులను నమ్మి మోసపోవద్దన్నారు.