ADB: నేరడిగొండ మండలంలోని కుంటాల గ్రామంలో ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వర్తించిన రోజా భీమ్ రావ్ పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా నిర్వహించిన పదవి విరమణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. వారిని శాలువాతో ఘనంగా సత్కరించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి కీలకమైందని అనిల్ జాదవ్ పేర్కొన్నారు.