MBNR: పేదలకు సన్నబియ్యం ఇవ్వడం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పు ప్రారంభమైందని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని కొత్తూరు,కుందుర్గు,కేశంపేట,ఫరూక్ నగర్,చౌదరి గూడెం, నందిగామ తదితర ప్రాంతాలలో సన్నబియన్ని మంగళవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.