SS: గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత ఇస్తామని మంత్రి సవిత అన్నారు. సోమందేపల్లి మండలం నాగినాయన చెరువు, గుడిపల్లి, తుంగోడు, వెలిదడకల,నడింపల్లి పంచాయతీలోని నాయకులతో పెనుకొండలో సోమవారం మంత్రి సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ఉన్న సమస్యల గురించి ప్రస్తావించారు. గ్రామాల వారిగా ఎలాంటి సమస్యలు ఉన్నాయని మంత్రి ఆరా తీశారు.