SS: లేపాక్షి మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై నరేంద్ర వివరాల మేరకు.. వీఆర్ఏ రామాంజనేయులును అతని తమ్ముడు అశ్వర్థ మద్యం తాగి మెట్ల మీద నుంచి తోసేశాడు. దీంతో వీఆర్ఏ ఇంటిపై నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలయై అక్కడికక్కడే మృతి చెందారు.