TG: ఇండియన్ ఎక్స్‌ప్రెస్-2025 సంవత్సరానికి గానూ 100 మంది ప్రముఖులతో భారతదేశంలోని అత్యంత శక్తివంతుల జాబితా విడుదల చేసింది. ఇందులో ప్రధాని మోదీ అగ్రస్థానం దక్కించుకోగా.. రాహుల్ 9వ స్థానం, చంద్రబాబు 14వ స్థానం, రేవంత్ రెడ్డి 28వ స్థానంలో ఉన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే రేవంత్ 11 స్థానాలు పైకి చేరుకున్నారు. దీంతో రాహుల్, రేవంత్‌లకు నేతలు శుభాకాంక్షలు చెబుతున్నారు.