AKP: వివాదాలు లేకుండా భూసమస్యలు పరిష్కరించుకోవాలని నాతవరం తహసీల్దార్ ఎ.వేణుగోపాల్ అన్నారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో పీజీఆర్ఎస్ ఫిర్యాదుదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం క్షేత్ర స్థాయిలో ఫిర్యాదులు పరిశీలించి న్యాయం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.