PLD: తెలుగుజాతి పునఃనిర్మాణం, అనగారిన వర్గాల సాధికారితే లక్ష్యంగా పుట్టుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఉద్ఘాటించారు. వెల్దుర్తి మండల కేంద్రం, బస్టాండ్ సెంటర్లో శనివారం ఘనంగా జరిగిన తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు.