ASR: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినట్లు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎంవీవీ ప్రసాద్ పేర్కొన్నారు. కొయ్యూరు మండలంలోని ఆర్.కొత్తూరు గ్రామంలో సీనియర్ నేత ఆర్.గోవింద్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఎంవీవీ పాల్గొన్నారు. ఆయన సమక్షంలో పెద్ద మల్లవరం గ్రామానికి చెందిన 50 కుటుంబాలు టీడీపీలో చేరారు.