SKLM: ఆమదాలవలస పట్టణంలో గల శ్రీ పాలపోల అమ్మవారి దేవస్థానం వెలుపలి ప్రాంగణంలో శనివారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. హృదయ స్పందన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 40 యూనిట్ల రక్తం సేకరించినట్లు ట్రస్ట్ ఛైర్మన్ పాండ్రంకి తారక్ తెలిపారు. అలాగే నో డ్రగ్స్.. నో ఆల్కహాల్.. నో బెట్టింగ్స్ అనే నినాదంతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.