AP: ఒక మహనీయుడి విజన్ ఈ టీడీపీ అని సీఎం చంద్రబాబు కొనియాడారు. టీడీపీ ఆవిర్భావం రాష్ట్రానికి చారిత్రక అవసరంగా మారిందని తెలిపారు. 9 నెలల్లో అధికారంలోకి రావడం మరెవరికీ సాధ్యం కాని ఘనత అని చెప్పారు. యువతను రాజకీయాల్లోకి తెచ్చిన నేత ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. తనకు అప్లికేషన్లు పెట్టుకుంటే పదవులు రావని.. క్షేత్ర స్థాయిలో పని చేసిన వాళ్లకే పదవులు వస్తాయని స్పష్టం చేశారు.