ADB: బజార్ హత్నూర్ మండలంలోని పిప్రి గ్రామానికి చెందిన తంగడిపల్లి గంగాధర్ గారికి మంజూరు అయిన రూ. 42 వేల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ఆయన నివాసంలో శనివారం అందజేశారు. వైద్య ఖర్చుల నిమిత్తం అయిన పత్రాలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమర్పించి సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధి పొందాలని ప్రజలకు అనిల్ జాదవ్ సూచించారు.