SKLM: ఎచ్చెర్ల మండలం ముద్దాడపేట ప్రాథమిక పాఠశాలలో శనివారం ఉగాది సంబరాలను నిర్వహించారు. ఉగాది పచ్చడిలో ఉండే షడ్రుచులను, పంచాగ శ్రవణం తదితర వివరాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు బొడ్డేపల్లి విజయమ్మ వివరించారు. విద్యార్థినులు సంప్రదాయ దుస్తులతో, నృత్యాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీరామ్మూర్తి, గోవిందరావు, యుఎస్ ప్రసాదరావు, నర్మదా ఉన్నారు.