ADB: బోథ్ మండలంలోని బాబేర గ్రామపంచాయతీ పరిధిలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను శనివారం ఎంపీడీఓ రమేశ్ పరిశీలించారు. అక్కడ కొనసాగుతున్న చెరువు నిర్మాణ పనుల కొలతలు తీసుకున్నారు. రోజువారి కూలీల హాజరును పరిశీలించారు. భూగర్భజలాల నిలువ కోసం చేపట్టవలసిన పనుల గురించి వివరించారు. కూలీల చేస్తున్న హార్డ్ వర్క్ చూసి ప్రోత్సహించడానికి స్వీట్స్ పంచిపెట్టారు.