ఒకే దేశం- ఒకే ఎన్నికల కోసం కేంద్రం 2 బిల్లులను సిద్ధం చేసింది. గత వారంమే కేంద్ర కేబినెట్ ఈ బిల్లులకు ఆమోదం తెలిపింది. లోక్సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఒక బిల్లు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు అవసరమైన రాజ్యాంగ సవరణల కోసం మరో బిల్లును కేంద్రం పార్లమెంట్లో ఇవాళ ప్రవేశపెట్టనుంది.