AP: YCP నేతల తీరు దుర్మార్గమని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. దేవాలయం లాంటి అసెంబ్లీని అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అసెంబ్లీకి రారని.. మండలిలో సభ జరగనివ్వట్లేదని తెలిపారు. దేవదేవుడి ఫొటోలు పట్టుకుని మండలికి చెప్పులతో వచ్చారని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో అన్నిరంగాల్లోనూ దోపిడీయేనని పేర్కొన్నారు.