TG: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిన్నట్లు సమాచారం. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌కు 10 స్థానాల దూరంలో TVK నిలిచిన తరుణంలో.. కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, కాంగ్రెస్‌కు 5 స్థానాలు మాత్రమే ఉన్నాయి.