దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 50°Cకు చేరువ కావడంతో గత 4 రోజులుగా భారత్లో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో పెరిగింది. అయితే వరల్డ్ పాపులేషన్ రివ్యూ-2023 ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా విద్యుత్ వినియోగించే దేశాల్లో భారత్(1.5 ట్రిలియన్ kWh) వినియోగంతో మూడో స్థానంలో ఉంది. చైనా(8.9 ట్రిలియన్ kWh) వినియోగంతో తొలి స్థానంలో, అమెరికా(4.1 ట్రిలియన్ kWh)తో రెండో స్థానంలో ఉన్నాయి.