కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిపై ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంపై దర్యాప్తు పారదర్శకంగా జరగాలంటే రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాల్సిందేనని అన్నారు. అజిత్ పవార్ ప్రయాణించిన లేజర్ జెట్ విమాన యజమాని VSR సంస్థకి టీడీపీతో సంబంధాలున్నాయని పేర్కొన్నారు.