AP: నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తబురుజులో ఈనెల 9న సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రహదారుల వెంట చెత్త కుప్పలు, ప్లాస్టిక్ కవర్లు, మద్యం సీసాలు కనిపించకుండా చూడాలని సూచించారు. మరోవైపు డాగ్ స్క్వాగ్ బృందం హెలిఫ్యాడ్, సీఎం పర్యటించనున్న స్థలాలను క్షుణ్ణంగా పరిశీలించారు.