AP: రాష్ట్రంలోని మిగిలిన 53 బార్లకు రీనోటిఫికేషన్ను ప్రభుత్వం జారీ చేసింది. ఈ నెల నుంచి 2025 ఆగష్టు 31 వరకూ లీజుకు అనుమతి ఇచ్చేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసి అక్కడే ఫీజు చెల్లించాలని తెలిపింది. ఈ నెల 23 సాయంత్రం 5 గంటల వరకూ దరఖాస్తుకు అవకాశం కల్పించింది. అదే రోజు దరఖాస్తులను పరిశీలించి.. తర్వాతి రోజు సాయంత్రం 5 గంటల వరకూ ఆక్షన్ నిర్వహిస్తారు.