TG: రాష్ట్ర వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న సాంకేతిక, డిజిటల్ మౌలిక వసతులపై ఏఐ సమ్మిట్లో ప్రస్తావన రావడం గర్వకారణమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వ్యవసాయానికి సాంకేతికతను జోడించడంలో మన రాష్ట్రం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. శాటిలైట్ ద్వారా మట్టి పోషకాలను గుర్తించి, వాటిని ఏఐ మోడలింగ్ ద్వారా విశ్లేషించి పైలట్ కార్యక్రమాన్ని ప్రారంభించిదన్నారు.