AP: గత YCP పాలనలో రాష్ట్రవ్యాప్తంగా 200 ఆలయాల్లో విధ్వంసం జరిగిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గతంలో ధ్వంసమైన రామతీర్థం(విజయనగరం)లోని శ్రీరామ విగ్రహాన్ని ఇవాళ కోటిపల్లి(కోనసీమ)లో నిమజ్జనం చేయనున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. YCP పాలనలో ధ్వంసమైన విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నామని, ఇకపై ఇలాంటివి జరగకుండా చర్యలు చేపట్టామని తెలిపారు.