AP: ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 27న ఆయేషా శరీర అవశేషాలకు ఆచారాల ప్రకారం అంత్యక్రియలు చేయాలని ఆదేశించింది. అంత్యక్రియల ప్రక్రియను రికార్డ్ చేయాలని సూచించింది. రీపోస్టుమార్టం కోసం 2019లో ఆయేషా అవశేషాలను సీబీఐ అధికారులు వెలికి తీశారు.