TG: రాష్ట్రంలో చివరి దశకు మావోయిస్టు ఉద్యమం చేరుకుంది. డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో ఇవాళ నలుగురు మావోయిస్ట కీలక నేతలు లొంగిపోనున్నారు. అందులో ఒకరు దేవ్‌జీ.. అలియాస్ తిప్పిరి తిరుపతి. దేవ్‌జీ రాడికల్ విద్యార్థి సంఘం నాయకుడి నుంచి మావో అగ్రనేతగా ఎదిగారు. కోరుట్లకు చెందిన తిరుపతి భూస్వాముల అణచివేతపై చిన్నప్పటి నుంచే తిరుగుబావుటా ఎగురవేశారు.