TG: సచివాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, MLAలు, కలెక్టర్లు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు గ్రౌండింగ్ వేగవంతం చేయాలని పొంగులేటి ఆదేశించారు. బేస్మెంట్ పూర్తయిన ఇళ్లకు తక్షణమే చెల్లింపులు జరపాలని సూచించారు. జూన్ చివరి నాటికి వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు పూర్తి కావాలన్నారు.