ATP: గుత్తిలో ఆదివారం అర్ధరాత్రి తర్వాత విచిత్రమైన దొంగతనం జరిగింది. తాడిపత్రి రోడ్డులోని మురళీకృష్ణ జనరల్ స్టోర్లో ఉప్పు ప్యాకెట్లు చోరీకి గురయ్యాయి. ఓ మహిళ ముఖానికి మాస్కు ధరించి అంగడి బయట ఉన్న 15 ఉప్పు ప్యాకెట్ల డబ్బాను ఎత్తుకెళ్లింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. షాపు యజమాని ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టామన్నారు.