ATP: గుత్తి ఈద్గాలో సోమవారం రంజాన్ ప్రార్థనలకు మేనమామతో కలిసి వచ్చిన లాల్ ఖాసీం అనే ఐదేళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. సజ్జలదిన్నెకు చెందిన లాల్ ఖాసీం తన మేనమామ కమల్ భాషతో కలిసి ఆదివారం రంజాన్ పండుగకు వచ్చాడు. సోమవారం మేనమామతో కలిసి గుత్తి ఈద్గాలో ప్రార్థనలకు వచ్చాడు. ప్రార్థనలు అనంతరం లాల్ ఖాసీం కనిపించలేదు. బాలుడు ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.