చిత్తూరు: కుప్పం మండలం నడుమూరు పంచాయతీ, బోధ గుట్టపల్లి గ్రామంలో దళిత హక్కుల పరిరక్షణ సమావేశం ఆదివారం కుప్పం తహసీల్దార్ చిట్టి బాబు అధ్యక్షతన జరిగింది. తహసీల్దార్ చిట్టిబాబు మాట్లాడుతూ.. అంటరానితనం నిర్మూలనలో భాగంగా ప్రతినెల 30వ తేదీన దళిత వాడలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించాలన్నారు.