నిర్మల్: వెంగ్వాపేట్ గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గ్రామస్తుల వివరాల ప్రకారం మంగళవారం ఉదయం అటువైపు వెళ్లిన రైతులకు దుర్గంధమైన వాసన రావడంతో వ్యవసాయ బావి వైపు వెళ్లారు. అందులో వ్యక్తి మృతదేహం గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీస్ సిబ్బంది విచారణ చేపట్టారు.