NRML: కుబీర్ మండలం పార్డి(బి) రైతు వేదికలో సోమవారం బర్త్ డే వేడుకలు జరుపుకున్న నాయకుడిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం లక్షలు ఖర్చు చేసి రైతుల సమావేశానికి ఎర్పాటు చేసిన రైతు వేదికలో రాజకీయ నాయకుడి బర్త్ డే వేడుకలు జరపడమెంటని ధ్వజమెత్తారు. తమ వ్యక్తిగత కార్యకలాపాలకు ప్రభుత్వ స్థలాన్ని వాడుకుంటున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.