PPM: సాలూరులో ఆదివారం నుంచి ప్రారంభమైన శ్రీరామనవమి ఉత్సవాలలో మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర పాల్గొన్నారు. విశ్వావసు నామ సంవత్సరాన్ని (ఉగాది) పురస్కరించుకుని సాలూరు పట్టణంలో వెలమపేట, డబ్బివీధి ప్రజలు శ్రీరాములు స్వామి వారి విగ్రహాలను కోలాటాలతో, మేళతాళాలతో రథంలో ఊరేగిస్తూ వారి మండపాలకు తీసుకువచ్చారు. రాజన్నదొర భక్తులతో కలిసి రథాన్ని లాగారు.