BPT: బాపట్ల మండలం చెరువు జమ్ములపాలెం ఉన్నత పాఠశాలలో ఆదివారం రాష్ట్రస్థాయి పోటీలకు బాపట్ల జూనియర్ హాకీ బాలుర జట్టును ఎంపిక చేసినట్లు హాకీ బాపట్ల సంఘం కార్యదర్శి వీర చంద్ర తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఏప్రిల్ 6 నుంచి ధర్మవరంలో జరిగే రాష్ట్రస్థాయి హాకీ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటారని వివరించారు.