ATP: అక్కమాంబ అమ్మవారి జాతర సందర్బంగా ఆలయంలో కొలువైన శ్రీ అక్కమహాదేవి, పరమేశ్వరుడికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు, వారి సోదరుడు అమిలినేని ఎర్రిస్వామి పట్టు వస్త్రాలు అందించారు. పట్టు వస్త్రాలతో వచ్చిన ఎమ్మెల్యేకి ఆలయ కమిటీ ఛైర్పర్సన్ పద్మావతి ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.