కృష్ణా: విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదివారం ఉగాది సందర్భంగా కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే బృందానికి ఆశీర్వచనం అందజేసి తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ప్రజలంతా ఆరోగ్యంగా, సుభిక్షంగా ఉండాలని దుర్గమ్మను ప్రార్థించి మొక్కులు చెల్లించుకున్నట్లు సుజనా తెలిపారు.