PDPL: ఓదెల మండలంలోని జీలకుంట గ్రామంలో నెమలి ప్రవేశించగా గ్రామస్తులు స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న బ్లూ కోర్ట్స్ పోలీసులు శంకర్, రామకృష్ణ నెమలిని స్వాధీనం చేసుకొని వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫారెస్టు ఆఫీసర్ తిరుపతి ఆదివారం రాత్రి నెమలిని స్వాధీనం చేసుకున్నారు.