MBNR: మే1 నుంచి ప్రతి గ్రామానికి రెవెన్యూ అధికారులు వచ్చి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి తెలిపారు. భూ సమస్యలు, వివాదాలు తలెత్తకుండా భూ భారతి చట్టం కింద వివరాలను డిజిటలైజేషన్ చేస్తారని అన్నారు. అడ్డాకులలో నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.