KRNL: ప్రజా సమస్యలు పునరావృతం కాకుండా అధికారులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కర్నూల్ నగరపాలక కమిషనర్ రవీంద్ర బాబు ఆదేశించారు. సోమవారం నగరంలోని కర్నూలులోని నగర పాలక సంస్థ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 17 అర్జీలు వచ్చాయని ఆయన తెలిపారు. వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు.