NZB: ఎడపల్లి మండలం సాటాపూర్ గేట్ వద్ద ఆదివారం రాత్రి వడ్ల లారీ బోల్తా పడింది. ఎడపల్లి వైపు వెళ్తున్న ధాన్యం లారీ పెట్రోల్ బంక్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో లారీలో ఉన్న వరి ధాన్యం బస్తాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడంతో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న ఎడపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను డైవర్ట్ చేశారు.