KRNL: ఆలూరు మండలం కురుకుంద గ్రామంలో నీటి సమస్య రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. గ్రామంలో నీటి వనరులన్నీ దాదాపు ఎండిపోవడంతో, స్థానికులు దూర ప్రాంతాలకు వెళ్లి నీటిని తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. పండగ వేళ కూడా బిందెడు నీటి కోసం గ్రామస్థులు రాత్రి వేళల్లోనూ జాగారం చేస్తున్నారు. ట్రాక్టర్లో డ్రమ్ములు పెట్టుకొని నీటీని తెచ్చుకుంటున్నారు. అధికారు స్పందించాలని కోరారు.