VSP: రంజాన్ పండుగ సందర్భముగా ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో విశాఖ సీపీ ఆఫీసులో ప్రతి సోమవారం జరిగే “ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ ఆదివారం తెలిపారు. విశాఖ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ప్రజలకు అత్యవసర పరిస్థితిలో దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లలో, కంట్రోల్ రూమ్ నంబర్‌కు సంప్రదించాలన్నారు.