SKLM: అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్లు అని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. ఈ మేరకు పోలాకి మండలం CP రోడ్డు నుండి చీడివలస వరకు రూ.1.75 లక్షలతో 3200 మీటర్లు తారు రోడ్డు నిర్మాణానికి ఆదివారం భూమి పూజచేసి, శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల హామీలలో భాగంగా ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటి నెరవేరుస్తున్నామన్నారు.