AP: అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రాజధాని రైతులకు వార్షిక కౌలును CRDA జమ చేస్తోంది. కొత్తగా ల్యాండ్ పూలింగ్‌కు భూములిచ్చే రైతులకూ కౌలు నిధులను అందిస్తున్నట్లు తెలిపింది. ఈ నెలాఖరులోగా అర్హులందరికీ నిధులను జమ చేయాలని CRDA నిర్ణయించింది. కౌలు రాని వాళ్లు ఎవరైనా ఉంటే అవసరమైన పత్రాలు ఇవ్వాలని, వాటిని పరిశీలించి నిధులు జమ చేస్తామని CRDA పేర్కొంది.