AP: మహిళల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి సత్యకుమార్ అన్నారు. మహిళల సాధికారత, ఆర్థిక స్వావలంబనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మాతా శిశు మరణాలు తగ్గించడానికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని వెల్లడించారు.